Home  »  TV News  »  ఇన్ స్టాగ్రామ్ లో జీవిత పాఠాలు చెప్తున్న యాంకర్ రవి!

Updated : Jul 31, 2023

యాంకర్ రవి.. యాంకరింగ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన రవి అందరికి సుపరిచితమే. షోస్, ఈవెంట్స్ లలో బిజీగా ఉంటోన్న రవి.. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. 'సంథింగ్ స్పెషల్' అంటూ కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఆ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో రవి ఫాలోయింగ్ బాగుండేది. రవి ఆ షో చేస్తుంటే లైవ్ లో తనకి కాల్ చేసి మరీ.. మ్యారేజ్ చేసుకోమని అడిగేవారు.. అప్పట్లో రవికి అంత క్రేజ్ ఉండేది.

ఆ తర్వాత బిగ్ బాస్-5 లో ఎంట్రీ ఇచ్చిన రవికి.. హౌస్ లో పాజిటివ్ ఇంప్రషన్ కన్నా నెగటివ్ ఇంప్రెషనే ఎక్కువ వచ్చింది‌. ఏం వచ్చిన  ఫేమ్ అయితే వచ్చిందనే చెప్పాలి. రవి ఎంట్రీతో బిగ్ బాస్ విన్నర్ అతనే అని మొదట్లో అనిపించిన.. తను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను బిహేవ్ చేసిన దానికి... అదంతా తలకిందులై.. అనుకోకుండా రవి బయటికొచ్చేసాడు. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఫ్యామిలీ వీక్ లో.. రవి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎమోషనల్ గా సాగిన ఎపిసోడ్.. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇన్ బిగ్ బాస్ గా చెప్పుకోవచ్చు. రవి యాంకరింగ్ అంటేనే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రేక్షకులను సైతం తన మాటలతో ఉత్తేజపరుస్తాడు.

యాంకర్ రవి.. కొన్ని వారాల క్రితం శ్రీలంకకి షిప్ లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. అది వ్లాగ్ చేయగా ఫుల్ వైరల్ అయింది. అయితే తాజాగా అమెరికాకి ఒక షో కోసం వెళ్ళిన వ్లాగ్, వచ్చాక తన భార్య కోసం సర్ ప్రైజ్ అంటూ మరొక వ్లాగ్ చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు  యాంకర్ రవి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో జీవిత పాఠాలు చెప్తున్నాడు. " మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా.. మనం ఎవరికోసమైతే కష్టపడుతున్నామో వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోతే వాళ్ళ జుట్టు పట్టుకొనో, గల్ల పట్టుకొనో చెప్పాలి.. మేం మీ కోసమే కష్టపడుతున్నాము అని చెప్పాలి " అంటూ యాంకర్ రవి చెప్పాడు. అగస్ట్ మొదటి వారంలో రోహిణితో కలిసి ఒక షో స్టార్ట్ అవుతున్నట్టుగా చెప్పాడు రవి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.